Updated : 28/05/2020 19:12 IST

ఆ 5 రాష్ట్రాల నుంచి ఇప్పుడే రావొద్దు:కర్ణాటక

బెంగళూరు: కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల నుంచి ఏ ఒక్క వ్యక్తినీ తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు, రైళ్ల రాకపోకలతో పాటు రహదారి మార్గంలో కూడా రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. 

దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 56,948 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. గుజరాత్‌లో 15000, తమిళనాడులో 18,545, మధ్యప్రదేశ్‌లో 7261, రాజస్థాన్‌లో 7703 చొప్పున నమోదయ్యాయి. మరోవైపు, కర్ణాటకలో గడిచిన 24గంటల్లోనే 115 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2533కి పెరిగిపోయింది. వీరిలో ఇప్పటివరకు 834 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 47మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1650 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని