అలాంటి వారు శ్రామిక్‌ రైళ్లలో ఎక్కొద్దు!

వలస కార్మికుల తరలింపు కోసం ఉద్దేశించిన శ్రామిక్‌ రైళ్లలో ముందస్తు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కొద్దని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. గత కొన్నిరోజుల్లో పలువురు ఈ రైళ్లలో ప్రయాణిస్తుండగానే మరణించిన విషయం తెలిసిందే.......

Published : 29 May 2020 12:22 IST

రైల్వేశాఖ విజ్ఞప్తి

దిల్లీ: వలస కార్మికుల తరలింపు కోసం ఉద్దేశించిన శ్రామిక్‌ రైళ్లలో ముందస్తు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కొద్దని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. గత కొన్నిరోజుల్లో పలువురు ఈ రైళ్లలో ప్రయాణిస్తుండగానే మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వేశాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. మే 27 నుంచి మొదలుకొని 48 గంటల్లో మార్గమధ్యంలోనే తొమ్మిది మంది మృతిచెందారు. వీరిలో చాలా మంది ముందుగానే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా గుర్తించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బీపీ, క్యాన్సర్, గుండె సంబంధిత‌ వంటి ఇతర ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా శ్రామిక్‌ రైళ్లలో ప్రయాణించొద్దని విజ్ఞప్తి చేశారు. గర్భవతులు, 10 ఏళ్లలోపు పిల్లలు అత్యవసరమైతే తప్ప రైలు ప్రయాణం చేయొద్దని సూచించారు. అవసరమున్న ప్రతిఒక్కరికీ సేవలు అందించేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని