కార్మికులు గమ్యం చేరే వరకు శ్రామిక్‌ రైళ్లు

వలస కార్మికులు వారి గమ్యం చేరే వరకు శ్రామిక్‌ రైళ్లు నడుపుతామని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాలు కోరిన వెంటనే అదే రోజు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి, మరుసటి రోజు నడుపుతామని వినోద్‌ కుమార్‌ తెలిపారు.

Published : 29 May 2020 20:42 IST

దిల్లీ: వలస కార్మికులు వారి గమ్యం చేరే వరకు శ్రామిక్‌ రైళ్లు నడుపుతామని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాలు కోరిన వెంటనే అదే రోజు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి, మరుసటి రోజు నడుపుతామని వినోద్‌ కుమార్‌ తెలిపారు. సూరత్‌ నుంచి సివాన్‌కు రైలు చేరడానికి 9రోజులు పట్టిందని కొన్ని మీడియాల్లో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. కేవలం ఇది రెండు రోజుల్లోనే చేరినట్లు వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటివరకు నడిపిన 3,840 రైళ్లలో కేవలం 4మాత్రమే వాటి గమ్యస్థానానికి చేరడానికి 72గంటల సమయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్‌ ప్రకటించారు. వీటిలో 70 రైళ్లను మాత్రమే మిగతా మార్గాల ద్వారా మళ్లించామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించే వారికి ఆహారాన్ని అందించేందుకు సాధ్యమైనంత వరకూ ప్రయత్నం చేయడంతో పాటు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు