వలసకూలీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు

దేశంలో కరోనా సంక్షోభంతో నెలకొన్న పరిస్థితుల వల్ల వలసకూలీలు, కార్మికులు సహా ఇతర వర్గాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. అయితే, ఈ సమస్యలు విపత్తులుగా రూపాంతరం చెందకుండా....

Updated : 30 May 2020 11:02 IST

దిల్లీ: దేశంలో కరోనా సంక్షోభంతో నెలకొన్న పరిస్థితుల వల్ల వలసకూలీలు, కార్మికులు సహా ఇతర వర్గాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. అయితే, ఈ సమస్యలు విపత్తులుగా రూపాంతరం చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు. రెండో దఫా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాసిన బహిరంగ లేఖలో మోదీ కరోనా సంక్షోభ పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చడంలో ప్రభుత్వం రూపొందించిన రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ కీలకంగా మారనుందని మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక పునరుజ్జీవనం సాధించడంలో భారత్‌ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆత్మ నిర్భర్‌ అభియాన్‌’ పేరిట తీసుకున్న చర్యల ద్వారా రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు, యువత ఇలా అన్ని వర్గాలు కొత్త అవకాశాలు పొందనున్నారన్నారు. కరోనా మహమ్మారిని జయించే దిశగా భారత్‌ తీసుకుంటున్న చర్యలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. అదే తరహాలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో సైతం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవనుందన్నారు. భారత ప్రజలు ఇకపై స్వయం శక్తితో చేసే ఉత్పత్తి.. దేశం దిగుమతులపై ఆధారపడకుండా చేయగలదని మోదీ వ్యాఖ్యానించారు. అనేక చరిత్రాత్మక నిర్ణయాలతో భారత్‌ విజయ పథం దిశగా సాగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని