శ్రామిక్‌ రైళ్లలో 80 మంది మృతి!

శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో ఇప్పటివరకు 80 మంది వలస కార్మికులు మృతి చెందినట్టు రైల్వేశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో

Published : 31 May 2020 00:50 IST

ఈనాడు, దిల్లీ : శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో ఇప్పటివరకు 80 మంది వలస కార్మికులు మృతి చెందినట్టు రైల్వేశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో ఒకరు కరోనా వైరస్‌తో మరణించగా, మిగిలినవారి మరణాలకు అనారోగ్య సమస్యలు సహా విభిన్న కారణాలున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మే 9 నుంచి 27 మధ్య ఈ మరణాలు సంభవించాయి. శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ను ఈ మరణాల విషయం అడిగినప్పుడు ఆయన దాటవేశారు. వీటిపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాకే వెల్లడిస్తామన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని