
Published : 30 May 2020 23:58 IST
కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని వాన్‌పొరా ప్రాంతంలో పోలీసు దళాలు గాలింపు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా భద్రతా దళాలు ఎదురుదాడి చేశాయని అధికారులు వెల్లడించారు. మరణించిన వ్యక్తులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారో ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.
Tags :