
రేపట్నుంచే రైళ్లు.. 1.45 లక్షల మంది ప్రయాణం
దిల్లీ: రైల్వే సేవలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. తొలి రోజు 1.45 లక్షల మంది ప్రయాణాలు చేయనున్నారని రైల్వేశాఖ తెలిపింది. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు ప్రయాణించేందుకు మొత్తం 26 లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు పేర్కొంది. శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, మే 12 నుంచి నడుస్తున్న 30 ప్రత్యేక రైళ్లకు ఈ 200 రైళ్లు అదనమని ఇది వరకే రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.
రేపటి నుంచి రైళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైల్వే శాఖ మరోసారి ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. ప్రయాణికులంతా 90 నిమిషాల ముందే రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కన్ఫర్మ్, ఆర్‌ఏసీ టికెట్ ఉన్నవారినే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పింది. ప్రయాణికులందరికీ స్ర్కీనింగ్ నిర్వహిస్తామని, ఎలాంటి లక్షణాలూ లేని వారికి మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని రైల్వేశాఖ స్పష్టంచేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.