నేడు శ్రీలంక నుంచి ‘సముద్ర సేతు’!

వందే భారత్‌ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. సముద్రమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ ద్వారా వేల సంఖ్యలో భారతీయులను తరలిస్తోంది.

Published : 01 Jun 2020 10:26 IST

700మందిని తరలించేందుకు ఐఎన్‌ఎస్‌ జలాశ్వా సిద్ధం!

దిల్లీ: ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. సముద్రమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ చేపట్టి వేల సంఖ్యలో భారతీయులను తరలిస్తోంది. ఇప్పటికే మాల్దీవుల నుంచి రెండు దఫాల్లో దాదాపు 1500మందిని  ఐఎన్‌ఎస్‌ జలాశ్వా స్వదేశానికి తీసుకొచ్చింది. తాజాగా శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి మరోసారి ఐఎన్‌ఎస్‌ జలాశ్వా సిద్ధమయ్యింది. ఈ సాయంత్రం దాదాపు 700 మంది భారతీయులతో కొలంబో నుంచి తమిళనాడులోని ట్యూటికోరిన్‌కు బయలుదేరనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాతే నౌకలోకి ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు