అమెరికాపై ఎదురుదాడికి దిగిన చైనా!

హాంగ్‌కాంగ్‌ విషయంలో జోక్యం చేసుకుంటున్న అమెరికాపై తాజాగా చైనా ఎదురుదాడికి దిగింది. హాంగ్‌కాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయాలని ప్రయత్నిస్తున్న చైనాపై చర్యలు తప్పవని ఈ మధ్యే ట్రంప్‌ స్పష్టం చేశారు.

Published : 01 Jun 2020 18:28 IST

అంతర్గత విషయంలో జోక్యాన్ని సహించమని హెచ్చరిక..!

బీజింగ్‌: హాంగ్‌కాంగ్‌ విషయంలో జోక్యం చేసుకుంటున్న అమెరికాపై తాజాగా చైనా ఎదురుదాడికి దిగింది. హాంగ్‌కాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయాలని ప్రయత్నిస్తున్న చైనాపై చర్యలు తప్పవని ఈ మధ్యే ట్రంప్‌ స్పష్టం చేశారు. హాంగ్‌కాంగ్‌కు ఎంతోకాలంగా గర్వకారణంగా ఉన్న హోదాను చైనా ప్రభుత్వం అణచివేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా చైనా విద్యార్థులపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. దీనిపై తాజాగా చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఇది ఇరువైపుల హానికలిగించే చర్యగా పేర్కొంది. చైనా ప్రయోజనాలకు హానికలిగించే ఎలాంటి చర్యలు, మాటలున్నా తీవ్ర ప్రతిఘటన ఉంటుందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ హెచ్చరించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తున్న అమెరికా చర్యల కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని తెలిపారు.

ఇదిలా ఉంటే, హాంగ్‌కాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయాలని చైనా ప్రతిపాదించిన చట్టానికి అక్కడి పార్లమెంట్‌ ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ హాంగ్‌కాంగ్‌లో ఇప్పటికీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని