శభాష్‌ నాసా, స్పేస్‌ఎక్స్‌..!

తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా అమెరికా భూభాగం నుంచి మానవసహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టిన అమెరికాకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభినందనలు తెలిపింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొంది. ఈ మేరకు అమెరికా రోదసి సంస్థ (నాసా), ప్రైవేటు కంపెనీ స్పేస్‌ఎక్స్‌ను కొనియాడింది.

Published : 02 Jun 2020 02:02 IST

 ఇస్రో అభినందన


బెంగళూరు: తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా అమెరికా భూభాగం నుంచి మానవసహిత అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టిన అమెరికాకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభినందనలు తెలిపింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొంది. ఈ మేరకు అమెరికా రోదసి సంస్థ (నాసా), ప్రైవేటు కంపెనీ స్పేస్‌ఎక్స్‌ను కొనియాడింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక ఆదివారం ఇద్దరు నాసా వ్యోమగాములను భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి చేరవేసిన సంగతి తెలిసిందే. వాణిజ్య అంతరిక్ష యాత్రల శకానికి ఇది శ్రీకారం చుట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని