పరిశ్రమలో పేలుడు.. ఐదుగురి మృతి

గుజరాత్‌లోని ఓ రసాయన పరిశ్రమలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఆ రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతమైన దహేజ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు

Published : 03 Jun 2020 18:12 IST

దిల్లీ: గుజరాత్‌లోని ఓ రసాయన పరిశ్రమలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఆ రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతమైన దహేజ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, సుమారు 30మందికి పైగా గాయపడ్డారు. పరిశ్రమ నుంచి వెలువడిన వాయువు విషపూరితమైనది కావడంతో దగ్గర్లోని గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఓ అధికారి మీడియాకు వెల్లడించారు. 10కిపైగా అగ్నిమాపక శకటాలు అక్కడ మంటలు ఆర్పుతున్నాయని తెలిపారు. పేలుడు సంభవించినప్పుడు నల్లటి వాయువు వెలువడింది.

‘మధ్యాహ్నం ఆగ్రో-కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలడంతో 35 నుంచి 40 మంది సిబ్బందికి మంటలు అంటుకున్నాయి. ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. గాయపడిన వారిని భారుచ్‌లోని ఆసుప్రతికి తరలించాం. మంటలు అదుపులోకి తేవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని భారుచ్ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మంటలు పరిశ్రమ అంతా కమ్మివేయడంతో దగ్గర్లోని రెండు గ్రామాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆయన తెలిపారు. కాగా, ఈ ప్లాంట్‌ యశశ్వి రసాయన ప్రైవేటు లిమిటెడ్‌కు చెందినదిగా అధికారులు చెబుతున్నారు. పారిశ్రామిక అవసరాల నిమిత్తం అక్కడ సుమారు 15 రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇదిలా ఉండగా, వెంటనే పేలుడుకు సంబంధించిన వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని