ఆ హత్య దారుణం: రతన్‌ టాటా

పేలుడు పదార్థాలతో ఉన్న పైనాపిల్ తిని, ఏనుగు మరణించిన తీరుపై ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 04 Jun 2020 13:42 IST

కేరళలో ఏనుగు మరణంపై ఆవేదన

ముంబయి: పేలుడు పదార్థాలతో ఉన్న పైనాపిల్ తిని ఏనుగు మరణించిన తీరుపై టాటా గ్రూప్‌ అధినేత రతన్‌ టాటా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అది ‘ప్రణాళిక ప్రకారం చేసిన హత్య’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా బలైన ఆ ఏనుగుకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని ట్విటర్ వేదికగా కోరారు.  

‘ఎవరికీ హాని తలపెట్టని, గర్భంతో ఉన్న అమాయక ఏనుగుకు పేలుడు పదార్థాలతో నిండిన పైనాపిల్‌ను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే అందించి దాని మరణానికి కారణమయ్యారన్న విషయం తెలుసుకొని తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఆ విషయం నన్ను షాక్‌కు గురిచేసింది. ఇది కూడా ప్రణాళిక ప్రకారం మనుషులను హత్యచేయడం వంటిదే. ఏనుగుకు న్యాయం జరగాలి’ అని టాటా ట్వీట్ చేశారు. ఈ దారుణ హత్యపై నెట్టింట్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కాగా, ఈ ఘటనపై వన్యప్రాణి నేర దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుందని బుధవారం కేరళ ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని నివేదిక కోరింది. 

ఇవీ చదవండి:

నమ్మింది..మోసపోయింది..!

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు