కరోనాతో మహిళ మృతి.. 91మందికి క్వారంటైన్‌

ముంబయి నుంచి రైలులో వచ్చిన ఓ 65 ఏళ్ల మహిళ జైపూర్‌ రైల్వేస్టేషన్‌లో కరోనాతో మృతి చెందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆమెతో పాటు ఆ బోగీలో ప్రయాణించిన 91మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు

Updated : 06 Jun 2020 23:53 IST


 

జైపూర్‌: ముంబయి నుంచి రైలులో వచ్చిన ఓ 65 ఏళ్ల మహిళ జైపూర్‌ రైల్వేస్టేషన్‌లో కరోనాతో మృతి చెందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆమెతో పాటు ఆ బోగీలో ప్రయాణించిన 91మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ ముంబయి నుంచి జైపూర్‌కు రైలులో ప్రయాణించింది. గురువారం జైపూర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆమె.. ప్లాట్‌ఫాం మీద సొమ్మసిల్లి పడిపోయింది. ప్రాథమిక చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నిబంధనల ప్రకారం అధికారులు ఆమె మృతదేహం నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. శుక్రవారం వెలువడిన నివేదికల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె వద్ద ఫోన్‌, ఎలాంటి గుర్తింపుకార్డు లేవని, వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ముంబయి రైల్వేస్టేషన్‌లో ఆమెను సరిగ్గా పరీక్షించారా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక అధికారులు చెప్పారు. ఆమెతో పాటు ఆ బోగీలో ప్రయాణించిన 91మందిని క్వారంటైన్‌కు తరలించామన్నారు.
రాజస్థాన్‌లో తాజాగా 222 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 10,084కు చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన బులిటెన్‌లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని