60 సెకన్లలో 32 టీషర్ట్‌లు..!

లాక్‌డౌన్‌ ప్రజల్లోని కొత్త కళల్ని వెలికితీస్తోంది. కొందరు కొత్త విద్యలు నేర్చుకుంటుంటే.. మరికొందరేమో ఉన్న నైపుణ్యానికి పదునుపెట్టి రికార్డులు సృష్టిస్తున్నారు. అమెరికాకు చెందిన డేవిడ్‌ రష్‌ దంపతులు 60 నిమిషాల్లో 32 టీషర్ట్‌లు ధరించి గిన్నిస్‌ వరల్డ్‌.....

Published : 07 Jun 2020 00:59 IST

ఎలా వేసుకున్నాడో.. వీడియో చూడండి!

లాస్ఏంజెల్స్‌: లాక్‌డౌన్‌ ప్రజల్లోని కొత్త కళల్ని వెలికితీస్తోంది. కొందరు కొత్త విద్యలు నేర్చుకుంటుంటే.. మరికొందరేమో ఉన్న నైపుణ్యానికి పదునుపెట్టి రికార్డులు సృష్టిస్తున్నారు. అమెరికాకు చెందిన డేవిడ్‌ రష్‌ దంపతులు 60 సెకన్లలో 32 టీషర్ట్‌లు ధరించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సృష్టించారు. గతంలో ఉన్న 31 టీషర్ట్‌ల రికార్డును అధిగమించారు. నేలపై పరిచిన టీషర్ట్‌లను డేవిడ్‌ వేగంగా ధరిస్తుండగా.. ఆయన భార్య జెన్నీఫర్‌ వెనుక నుంచి సాయం చేశారు. ఇలా ఇద్దరు కలిసి నిమిషంలో గత రికార్డును బ్రేక్‌ చేశారు.

STEM (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) ఎడ్యుకేషన్‌ను ప్రమోట్‌ చేస్తూ.. డేవిడ్‌ ఇప్పటికే 100 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను సృష్టించారు. వీటికి సంబంధించిన వీడియోలు గతంలో వైరల్‌ అయ్యాయి. తను నెలకొల్పిన పలు రికార్డుల కోసం తన సతీమణి చాలా సహకరించారని, కానీ ఆమె పేరును అధికారికంగా జాబితాలో రాయలేదని డేవిడ్‌ ఈ సందర్భంగా చెప్పారు. ‘జెన్నీఫర్‌ నా వెనుక నుంచి టీషర్ట్‌ను బలంగా లాగింది. కేవలం ఒక మూమెంట్‌తో టీషర్ట్‌ను పూర్తిగా కిందికి లాగడం విశేషం’ అని చెప్పారు. ఇటీవల డేవిడ్‌ మరో రికార్డును సృష్టించారు. షేవింగ్‌ క్రీమ్‌ను తన స్నేహితుడి తలపై వేసి.. ఆ నురగలో బాల్స్‌ నిలిచేలా దూరం నుంచి విసిరాడు. ఈ వీడియోలను ఆయన తన యూట్యూబ్‌ ఖాతాలో అప్‌లోడ్‌ చేశారు.


 


 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని