కూలిన శిక్షణా విమానం.. ఇద్దరు మృతి

ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ పైలట్‌ సహా శిక్షణలో ఉన్న మహిళా పైలట్‌ మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం....

Updated : 08 Jun 2020 10:59 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో సోమవారం ఉదయం ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ పైలట్‌ సహా శిక్షణలో ఉన్న యువతి‌ మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢెంకానల్‌ జిల్లాలోని బిరసల్‌ వైమానిక స్థావరంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఈ స్థావరం నివాస సముదాయాలకు దూరంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక సమస్యల వల్లే కుప్పకూలి ఉంటుందని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని