జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్‌ 

భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన తల్లి మాధవి రాజె సింధియాకు కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో వారిద్దరూ సౌత్‌ దిల్లీ సాకేత్‌లోని

Published : 09 Jun 2020 16:05 IST

దిల్లీ : భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన తల్లి మాధవి రాజె సింధియాకు కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో వారిద్దరూ సౌత్‌ దిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్‌ హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో నాలుగు రోజుల క్రితమే జ్యోతిరాదిత్య ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన తల్లిలో మాత్రమే ఇప్పటికీ ఎలాంటి లక్షణాలు లేవు. వారిద్దరికీ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. 
అంతముందు భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రాలో కూడా కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో ఆయన గుర్గావ్‌లోని  ఆస్పత్రిలో చికిత్స తీసుకొని సోమవారానికి కోలుకున్నారు. సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌లో కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు ఈ రోజు ఉదయం కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని