10లక్షల కొత్త ఉద్యోగాలకు ప్రణాళిక: యోగి

రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు.......

Published : 11 Jun 2020 01:13 IST

వలస కార్మికుల ఉపాధిపై యూపీ సీఎం

లఖ్‌నవూ: రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు పరీక్షలు త్వరితగతిన నిర్వహించేందుకు అవసరమైన యంత్రాలను అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జూన్‌ 15 నాటికి మొత్తం 75 జిల్లాల్లో ట్రూనాట్‌ యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. కరోనాపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యంత్రాలను పలుచోట్ల అందుబాటులోకి తెచ్చినప్పటికీ వీటి సంఖ్యను మరింతగా పెంచాలని సూచించారు. కరోనా మరణాల రేటును ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంతో పాటు.. రోగులకు సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగి స్వరాష్ట్రానికి చేరుకున్న వలస కార్మికుల కోసం రాబోయే ఆర్నెళ్ల కాలంలో 10లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. పోలీసు సిబ్బంది కరోనా బారినపడకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. యూపీలో గడిచిన 24గంటల్లో 388 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,335కి పెరిగింది. ఈ మహమ్మారి బారిన పడినవారిలో ఇప్పటివరకు 6669 మంది కోలుకోగా.. 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని