స్వీడన్‌: పాల్మే ‘మిస్టరీ’ హత్య కేసు మూసివేత!

స్వీడన్‌ ప్రధాన మంత్రి ఒలోఫ్‌ పాల్మే 1986లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఇది జరిగి దాదాపు 34 సంవత్సరాలు గడుస్తున్నా కేసు మాత్రం హిస్టరీగానే మిగిలింది.

Updated : 11 Jun 2020 11:57 IST

అనుమానితుడి మరణంతో కేసు మూసివేత

స్టాక్‌హామ్‌: స్వీడన్‌ ఒకప్పటి ప్రధాన మంత్రి ఒలోఫ్‌ పాల్మే 1986లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఇది జరిగి దాదాపు 34 సంవత్సరాలు గడుస్తున్నా కేసు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రభుత్వం సుదీర్ఘ దర్యాప్తు జరిగినప్పటికీ హంతకులను మాత్రం గుర్తించలేకపోయింది. అయితే, ఈ కేసులో ప్రధాన అనుమానితుడు 2004 సంవత్సరంలోనే చనిపోయినట్లు తెలియడంతో ఈ కేసును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఒలోఫ్ పాల్మే స్వీడన్‌కు రెండు పర్యాయాలు(11 ఏళ్లు) ప్రధానమంత్రిగా పనిచేశారు. పాల్మే ఎంతో నిరాడంబరంగా జీవించేందుకు ఇష్టపడేవారు. కొన్ని సమయాల్లో సెక్యూరిటీ సిబ్బంది లేకుండానే బయటకు వెళ్లేవారు. అయితే, వామపక్ష భావాలు కలిగిన పాల్మేకు ప్రత్యర్థులు కూడా ఎక్కువే.  ఈ నేపథ్యంలో 1986 ఫిబ్రవరి 28 రాత్రి సమయంలో బయటకు వెళ్లిన పాల్మే హత్యకు గురయ్యారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 

పాల్మే హత్య జరిగిన అనంతరం దాదాపు 100మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. చివరకు ఓ వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లుగా భావించిన అధికారులు కేసు నమోదు చేశారు. అయితే, అతడు మద్యం, మత్తు పదార్థాలకు బానిసగా గుర్తించారు. ప్రాథమికంగా హత్యారోపణలతో అతన్ని దోషిగా పేర్కొంటూ శిక్ష ఖరారు చేశారు.  పూర్తి దర్యాప్తు అనంతరం అతనే హత్య చేసినట్లు సాంకేతికంగా నిరూపించలేకపోయారు. దీంతో న్యాయస్థానం అతన్ని విడుదల చేసింది. అనంతరం ప్రధాన మంత్రి హత్య కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. 2004లో ప్రధాన అనుమానితుడు మరణించినట్లు దర్యాప్తు అధికారి వెల్లడించారు. దీంతో ఈ కేసును మూసివేస్తున్నట్లు జూన్‌ 10న ప్రకటించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని