దొంగలను పట్టుకున్న పోలీసులకు సోకిన కరోనా

దొంగలను అరెస్టు చేసి, వారిని కోర్టుకు తరలించిన పదిమంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ముంబయిలోని కుర్లా ప్రాంతం నెహ్రూనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు..

Published : 14 Jun 2020 00:48 IST

ముంబయి: దొంగలను అరెస్టు చేసి, వారిని కోర్టుకు తరలించిన పదిమంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ముంబయిలోని కుర్లా ప్రాంతం నెహ్రూనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు చెంబూర్‌లోని ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణంలో చోరీ కేసును ఛేదించారు. దొంగతనంలో పాలుపంచుకున్న ఏడుగురు ముఠా సభ్యులను గతవారం అదుపులోనికి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం దొంగలకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా అందులో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఆ దొంగలను అదుపులోనికి తీసుకొని విచారించిన, వారిని కోర్టుకు తరలించిన పదిమంది పోలీసులకు పరీక్షలు నిర్వహించగా వారందరికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం పోలీసులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని