నేపాల్‌ చర్య సమర్థనీయం కాదు: భారత్‌

భారత్‌కు చెందిన మూడు భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్‌ తీసుకొచ్చిన మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదం తెలపడంపై భారత్‌ స్పందించింది. నేపాల్‌ ప్రభుత్వ చర్య ఎంతమాత్రం ........

Published : 14 Jun 2020 00:55 IST

దిల్లీ: భారత్‌కు చెందిన మూడు భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్‌ తీసుకొచ్చిన మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదం తెలపడంపై భారత్‌ స్పందించింది. నేపాల్‌ ప్రభుత్వ చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదని పేర్కొంది. చారిత్రక వాస్తవాలను ఆ దేశం విస్మరించిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు.

‘‘భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ చేసిన రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ దిగువ సభ ఆమోదం తెలిపింది. మ్యాప్‌ విషయంలో ఇది వరకే మా వైఖరిని స్పష్టంచేశాం. చారిత్రక వాస్తవాలను, సాక్ష్యాలను విస్మరించి కృత్రిమంగా ఆ భూభాగాలను నేపాల్‌ తమవిగా చెప్పుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు’’ అని అన్నారు. సరిహద్దు అంశానికి సంబంధించి కలిసి చర్చించుకోవాలన్న అవగాహనను నేపాల్‌ ఉల్లంఘించిందన్నారు.  భారత్‌ భూభాగాలైన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్‌ తీసుకొచ్చిన వివాదాస్పద కొత్త మ్యాప్‌కు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు దిగువ సభ శనివారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌ ఈ విధంగా స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని