పాక్‌ కాల్పుల్ని తిప్పికొడుతూ అమరుడైన జవాన్‌

పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత బలగాలు వాటిని దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఓ సైనికుడు వీరమరణం పొందారు.......

Updated : 14 Jun 2020 13:21 IST

జమ్మూ: పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కెర్ని సెక్టార్‌లో నియంత్రణా రేఖ వెంట కాల్పులకు తెగబడింది. మోర్టార్లతో విరుచుకుపడింది. వాటిని తిప్పికొట్టే క్రమంలో భారత్‌కు చెందిన ఓ సైనికుడు వీరమరణం పొందారు. ముగ్గురు గాయపడ్డారు. షాహ్‌పూర్‌-కెర్నీ సెక్టార్‌లో నియంత్రణా రేఖ వెంట శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెలలో పాక్‌ సైనిక కాల్పుల్ని తిప్పికొట్టే క్రమంలో ముగ్గురు జవాన్లు అమరులు కావడం విచారకరం. ఇంతకుముందు జూన్‌ 4న ఓ హవల్దార్‌, జూన్‌ 10న ఓ నాయక్‌ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనలో పాక్‌ వైపు ఎంత మంది మృతిచెందారన్నది ఇంకా తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని