దేశద్రోహం కేసులో వినోద్‌ దువాకు ఊరట

హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ వినోద్‌ దువాపై ఆ రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన దేశద్రోహం కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనను అరెస్టు చేయకూడదంటూ సుప్రీం ధర్మాసనం స్పష్టం...

Published : 15 Jun 2020 00:26 IST

అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు 

దిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ వినోద్‌ దువాపై ఆ రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన దేశద్రోహం కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనను అరెస్టు చేయకూడదంటూ సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే పాత్రికేయుడు కోరుకున్నట్లుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ కొనసాగించవచ్చని ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వీడియో విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో దిల్లీలో జరిగిన మత ఘర్షణలపై యూట్యూబ్‌ వేదికగా వినోద్‌ దువా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన స్థానిక భాజపా నేత షిమ్లా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని