ముంబయిలో కొన్ని లోకల్ రైళ్లకు అనుమతి

అత్యవసర విభాగాల్లో సేవలు అందించే ఉద్యోగుల కోసం సోమవారం నుంచి ముంబయిలో కొన్ని లోకల్‌ రైళ్లు రాకపోకలకు సిద్ధమయ్యాయి.

Updated : 15 Jun 2020 12:18 IST

అత్యవసర విభాగాల్లో సేవలు అందించే ఉద్యోగుల కోసం..

ముంబయి: అత్యవసర విభాగాల్లో సేవలు అందించే ఉద్యోగుల కోసం సోమవారం నుంచి ముంబయిలో కొన్ని లోకల్‌ రైళ్లు సర్వీసులను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా వాటిలో సాధారణ ప్రయాణికులకు అనుమతి లేదని పశ్చిమ రైల్వే వెల్లడించింది. వైరస్‌ ఉద్ధృతికి అడ్డుకట్ట వేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజారవాణా పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

‘సోమవారం, జూన్‌ 15, 2020 నుంచి ఎంపిక చేసిన కొన్ని సబర్బన్‌ రైళ్లను రాష్ట్రప్రభుత్వం గుర్తించిన అత్యవసర విభాగాల్లో సేవలు అందించే ఉద్యోగుల కోసం నడపాలని పశ్చిమ రైల్వే నిర్ణయించింది’ అని రైల్వేశాఖ ట్వీట్ చేసింది. ఈ రోజు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల మధ్య ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు చొప్పున నడవనున్నాయి. విరార్‌ నుంచి చర్చిగేట్‌ మధ్య మొదటి రైలు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో స్టేషన్‌కు వచ్చే వారు తప్పకుండా ఐడీ కార్డు చూపించాలని స్పష్టం చేశారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా పరిమితి ముగిసిన సీజన్‌ పాస్‌ల విషయంలో ప్రయాణికులకు అనుకూలంగా రైల్వే వెసులుబాటు కల్పించింది. కోల్పోయిన రోజులకు సంఖ్యకు సమానంగా పాస్‌ల చెల్లుబాటును పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. సామాజిక దూరంగా కారణంగా 1200 మంది ఉద్యోగులు వెళ్లాల్సిన రైల్లో, 700 మంది మాత్రమే ప్రయాణించనున్నారు. 

ముంబయి వాసులు తమ ప్రయాణాల కోసం ఎక్కువగా సబర్బన్‌ రైళ్లనే వినియోగిస్తుంటారు. కానీ, కరోనా వైరస్ మహమ్మారి వారి ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో ఆదివారం రాత్రికి 1,04,568 మంది కరోనా బారిన పడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని