పాక్‌లో ఇద్దరు భారత అధికారుల అదృశ్యం

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇద్దరు భారత అధికారులు అదృశ్యమైనట్లు సమాచారం. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో వీరు...

Updated : 15 Jun 2020 12:21 IST

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇద్దరు భారత అధికారులు అదృశ్యమైనట్లు సమాచారం. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో వీరు పనిచేస్తున్నారు. కాగా ఈ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖకు కూడా సమాచారం అందింది. ఈ విషయాన్ని భారత అధికారులు పాక్‌ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయం నుంచి కనపడకుండా పోయిన ఆ అధికారుల పేర్లు, వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

గతంలో భారతీయ దౌత్య సిబ్బంది పాక్‌లో వేధింపులకు గురయ్యారు. కారులో ఇంటికి వెళ్తున్న భారత దౌత్యాధికారి గౌరవ్‌ అహ్లువాలియాతో సహా మరికొందరిని పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లు ద్విచక్ర వాహనాలపై వెంబడించి వేధింపులకు గురిచేసినట్టు వార్తలు వెలువడ్డాయి. వారి నివాసాల బయటే ఈ ఘటనలు చోటుచేసుకోవటం గమనార్హం. వీటికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి.

ఇటీవల దిల్లీలోని పాక్‌ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై వారిని భారత్‌ స్వదేశానికి పంపించింది. దీనికి ప్రతీకార చర్యగా భారత దౌత్యాధికారులపై పాక్‌వేధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని