న్యూజిలాండ్‌లో మళ్లీ కరోనా కేసులు!

కరోనా వైరస్‌ రహిత దేశంగా ప్రకటించుకున్న న్యూజిలాండ్‌లో తాజాగా మరో రెండు పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గడచిన 24రోజుల్లో న్యూజిలాండ్‌లో తొలిసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో భౌతిక దూరంతోపాటు ఇతర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలపై ఉన్న ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఈ కేసులు బయటపడటం గమనార్హం.

Published : 16 Jun 2020 23:18 IST

కరోనారహిత దేశంగా ప్రకటించుకున్న కొద్ది రోజుల్లోనే..

వెల్లింగ్టన్: కరోనా వైరస్‌ రహిత దేశంగా ప్రకటించుకున్న న్యూజిలాండ్‌లో తాజాగా మరో రెండు పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గడచిన 24రోజుల్లో న్యూజిలాండ్‌లో తొలిసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో భౌతిక దూరంతోపాటు ఇతర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలపై ఉన్న ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఈ కేసులు బయటపడటం గమనార్హం. అయితే, ఈ రెండు కేసులు కూడా బ్రిటన్‌ నుంచి వచ్చినవారిలోనే బయటపడ్డట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

న్యూజిలాండ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు లేవని, వైరస్‌ బారిన పడిన వారిలో చివరి వ్యక్తికూడా కోలుకున్నట్లు జూన్‌ 8న న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా అర్డెర్న్‌ ప్రకటించారు. అయితే, రాబోయే రోజుల్లో వైరస్‌ కేసులు బయటపడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు. ఈ సమయంలో న్యూజిలాండ్‌ సరిహద్దులను కూడా మూసివేసి ఉంచారు. కేవలం న్యూజిలాండ్‌ దేశస్థులను మాత్రమే ఇతర దేశాల నుంచి వచ్చేందకు అనుమతి ఇస్తున్నారు. ఇలా ఇతర ప్రాంతాల నుంచి స్వదేశానికి వస్తున్న వారిని వెంటనే పరీక్షించి రెండు వారాలపాటు ఐసోలేషన్‌లో ఉంచే ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగానే బ్రిటన్‌ నుంచి వచ్చిన ఇద్దరిలో వైరస్‌ బయటపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

దేశంలో ఆంక్షలు సడలించిన నేపథ్యంలో కరోనా వైరస్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని అక్కడి నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.అయితే, రెండో దఫా వైరస్‌ విజృంభణ వచ్చినా, దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా స్పష్టంచేశారు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు 1506 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 22మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని