వెంటిలేటర్‌పై మధ్యప్రదేశ్‌ గవర్నర్‌

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టండన్‌ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. 85 ఏళ్ల టండన్‌ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు,  జ్వరంతో బాధపడుతూ ఈ నెల 11న లఖ్‌నవూలోని మేధాంత ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉన్నా.. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆసుపత్రి మంగళవారం ప్రకటన విడుదల చేసింది,....

Published : 17 Jun 2020 01:14 IST

లఖ్‌నవూ: మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టండన్‌ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. 85 ఏళ్ల టండన్‌ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, జ్వరంతో బాధపడుతూ ఈ నెల 11న లఖ్‌నవూలోని మేధాంత ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉన్నా.. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆసుపత్రి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మంగళవారం ఆసుపత్రి వచ్చి గవర్నర్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. సోమవారం గవర్నర్‌కు కడుపులో అంతర్గత రక్తస్రావానికి సంబంధించిన అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం లాల్జీ టండన్‌ ఐసీయూలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆసుపత్రి వెల్లడించింది. అలాగే డయాలసిస్‌ కొనసాగుతున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని