తమిళనాడు సీఎం పీఏ కొవిడ్‌తో మృతి

తమిళనాడు కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1515పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 49మంది మృత్యువాతపడ్డారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిలో ఒకరు కరోనా సోకి మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 24 Dec 2022 15:15 IST

చైన్నై: తమిళనాడు కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా బారినపడి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిలో ఒకరు కరోనా సోకి మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. సీఎం పళనిస్వామి పీఏగా పనిచేస్తున్న దామోదరన్‌ రెండు రోజుల క్రితమే కొవిడ్‌-19 లక్షణాలతో చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందతూ బుధవారం దామోదరన్‌ మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు.

ఇక చైన్నైలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ నెల 19నుంచి 12రోజులపాటు మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఇప్పటివరకు 48,019పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 528మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1515పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 49మంది మృత్యువాతపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని