వైద్యుల వేతనాలపై ఉత్తర్వులివ్వండి: సుప్రీం

కొవిడ్‌ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి వేతనాల చెల్లింపుపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వీరికి క్వారంటైన్ వసతులు కల్పించడంపై కూడా రాష్ట్రాలకు.......

Published : 17 Jun 2020 13:39 IST

కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం

దిల్లీ: కొవిడ్‌ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి వేతనాల చెల్లింపుపై రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వీరికి క్వారంటైన్ వసతులు కల్పించడంపై కూడా రాష్ట్రాలకు సూచనలు చేయాలని కోరింది. కోర్టు ఆదేశాల అమలుపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అమలుపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వైద్యులకు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి కాదన్న కేంద్ర నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఓ వైద్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, ఎస్‌.కె.కౌల్‌, ఎం.ఆర్‌.షా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని