
దిల్లీ ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్
మహిళా ఎమ్మెల్యేకూ కరోనా
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇటీవల సత్యేంద్ర జైన్‌కు అస్వస్థతగా ఉండటంతో ఆయనను స్థానిక రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ అని వచ్చింది. బుధవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే అతిషికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం ఆమెకు జ్వరం, దగ్గు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా వైద్యులు ఆమె నుంచి నమూనాలను సేకరించారు. తాజా ఫలితాల్లో పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆమెను హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా అతిషి దిల్లీ వైద్యారోగ్య విభాగంతో కలిసి పనిచేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.