
ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో భారత్ విజయం
దిల్లీ: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఆసియా- ఫసిపిక్ వర్గానికి చెందిన శాశ్వత సభ్య దేశంగా మరోసారి గెలుపొంది..యూఎన్‌స్సీకి ఎనిమిదోసారి ఎన్నికైంది. మొత్తం 193 సభ్యదేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో భారత్‌కు అనుకూలంగా 184 దేశాలు ఓటు వేశాయి. ఈ మేరకు ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్. తిరుమూర్తి వెల్లడించారు. 2021-22 కాలానికి అధిక మద్దతుతో భారత్‌ను ఐరాస సభ్యదేశాలు ఎన్నుకున్నాయని తెలిపారు. మొత్తం 192 ఓట్లు పోలవ్వగా భారత్‌కు 184 ఓట్లు లభించాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.