ఈ ఇనుప చువ్వలతోనే చైనా సైనికుల దాడి?

గల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అయితే, దాడి సమయంలో ఇరువైపుల సైన్యం ఎటువంటి తుపాకులు ఉపయోగించనప్పటికీ, చైనా సైనికులు ఇనుప చువ్వలు బిగించిన ఇనుప రాడ్లతో దాడిచేసినట్లు తేలింది. పొడవాటి ఇనుప కడ్డీలకు చివరన ఇనుప చువ్వలను వెల్డింగ్‌ చేసి ఉన్న ఫోటోలను తాజాగా ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్‌ శుక్లా ట్విటర్‌లో పోస్టు చేశారు.

Published : 19 Jun 2020 01:35 IST

దిల్లీ: గల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అయితే, దాడి సమయంలో ఇరువైపుల సైన్యం ఎటువంటి తుపాకులు ఉపయోగించనప్పటికీ, చైనా సైనికులు ఇనుప చువ్వలు బిగించిన ఇనుప రాడ్లతో దాడిచేసినట్లు తేలింది. పొడవాటి ఇనుప కడ్డీలకు చివరన ఇనుప చువ్వలను వెల్డింగ్‌ చేసి ఉన్న ఫోటోలను తాజాగా ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్‌ శుక్లా ట్విటర్‌లో పోస్టు చేశారు. గల్వాన్‌ ఘర్షణ జరిగిన ప్రాంతంలో భారత సైనికులు ఈ ఫోటోలు తీసినట్లు తెలిపారు. కర్నల్‌గా సేవలందించిన అజయ్‌ శుక్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్నో విషయాలను ఇదివరకు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించిన అజయ్‌ శుక్లా, ఇది సైనికచర్య కాదని నేరపూరిత చర్యగా అభివర్ణించారు. అయితే, ఇనుప చువ్వలు వెల్డింగ్‌ చేసివున్న దృశ్యాలు చూస్తుంటే చైనా పక్కా ప్రణాళికతోనే భారత సైన్యంపై ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, గల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో మరణించిన అమరుల పార్థీవ దేహాలను ఈరోజు లేహ్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంలో భారీ సంఖ్యలో హాజరైన లద్దాఖ్‌ యువత తెల్ల కండువాలను ఊపుతూ నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని