తొలి కొవిడ్‌ టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ!

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా కొవిడ్‌-19 నిర్థారణ పరీక్షలు భారీ సంఖ్యలో చేయడం అనివార్యమయ్యింది. దీనిలో భాగంగా దేశంలోనే తొలిసారిగా కొవిడ్‌-19 మొబైల్‌ లేబొరేటరీని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఈ రోజు దిల్లీలో ప్రారంభించారు.

Published : 18 Jun 2020 19:51 IST

దిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా కొవిడ్‌-19 నిర్థారణ పరీక్షలు భారీ సంఖ్యలో చేయడం అనివార్యమయ్యింది. దీనిలో భాగంగా దేశంలోనే తొలిసారిగా కొవిడ్‌-19 మొబైల్‌ లేబొరేటరీని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఈ రోజు దిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేవలం 8రోజుల్లోనే ఈ మొబైల్‌ లేబొరేటరీ రూపొందించినట్లు తెలిపారు. ఈ వాహనం ద్వారా నిత్యం 50ఆర్‌టీ-పీసీఆర్‌, 250ఎలీసా పరీక్షలతోపాటు అదనంగా క్షయ, హెచ్‌ఐవీ వంటిరోగాలకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందని మంత్రి వెల్లడించారు. ఈ వాహనంలోని పరికరాలను రెట్టింపు చేసుకోవడం ద్వారా దాదాపు రోజుకు 500 నిర్ధారణ పరీక్షలు చేయవచ్చాన్నారు. సౌకర్యాలులేని గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందుబాటులోకి తేవడానికి వినూత్న ఆలోచనలతో అభివృద్ధి చేసిన ఇలాంటి పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. 

అయితే కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన సమయంలో (ఫిబ్రవరి నెలలో) దేశంలో కేవలం ఒక్క లేబొరేటరీ మాత్రమే ఉండేదని అన్నారు. అలాంటిది ప్రస్తుతం దేశవ్యాప్తంగా 953ల్యాబ్‌లు అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటిలో 699 ల్యాబ్‌లు ప్రభుత్వానివేనని తెలిపారు.

దేశంలో ఈ సంక్షోభం సమయంలో ప్రయోగశాలల అవసరం ఎంతో ఉందన్న విషయం తెలిసిందే. ఈ కొరతను తీర్చేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌-టెక్‌ జోన్‌ సహకారంతో ఈ మొబైల్‌ లేబొరేటరీ రూపొందించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని