దిల్లీపై కేంద్రం మరో కీలక నిర్ణయం

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన...

Published : 18 Jun 2020 22:14 IST

కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన 169 నిర్ధారణ కేంద్రాల్లో 6 లక్షల ర్యాపిడ్ యాంటీ కొవిడ్ టెస్టులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వివరాలను వెల్లడించారు. దిల్లీలోని కరోనా నిర్ధారణ కేంద్రాలకు దక్షిణ కొరియా నుంచి తెప్పించిన 50 వేల టెస్టింగ్ కిట్లను సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కేంద్రాల్లో  ఫలితాలు 30 నిమిషాల్లో తెలుస్తాయని కిషన్‌ రెడ్డి అన్నారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని దిల్లీ ఆస్పత్రులకు త్వరలో 500 వెంటిలేటర్లు, 650 అంబులెన్సులను అందిచనున్నట్లు మంత్రి వెల్లడించారు. కంటైన్‌మెంట్, పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వం గుర్తించిన కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. గత మూడు రోజులుగా 16,618 మంది నుంచి నమూనాలను సేకరించామని, అలానే రోజుకు 4,500 మందికి టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని