రైల్వేలో భారీ నియామకాలు

కరోనా సంక్షోభంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. అసిస్టెంట్‌ లోకో పైలట్స్‌ (ఏఎల్‌పీ) విభాగంలో...

Published : 18 Jun 2020 23:03 IST

దిల్లీ: కరోనా సంక్షోభంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. అసిస్టెంట్‌ లోకో పైలట్స్‌ (ఏఎల్‌పీ) విభాగంలో 26,968, టెక్నీషియన్స్‌ విభాగంలో 28,410 చొప్పున మొత్తం 55,378 నియామకాలు చేపట్టినట్లు పేర్కొంది. 10123 మంది ఏఎల్‌పీలకు 17 వారాలపాటు, 8997 మంది టెక్నీషియన్లకు ఆరునెలలపాటు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. నియామక పత్రాలు లాక్‌డౌన్‌ కన్నా ముందే పంపినప్పటికీ కరోనా నేపథ్యంలో చాలా మంది విధుల్లో చేరలేదని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మొద్దని, అధికారిక వెబ్‌సైట్లు చూడాలని అభ్యర్థులకు సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని