వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించండి

కొవిడ్‌పై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని...

Published : 19 Jun 2020 01:24 IST

రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ

దిల్లీ: కొవిడ్‌పై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది.  కొవిడ్‌ సేవల్లో ఉన్న వైద్య సిబ్బంది అందరికీ సకాలంలో జీతాలు చెల్లించాలని పేర్కొంటూ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూదన్‌ గురువారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎయిమ్స్‌ డైరెక్టర్, అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల డైరెక్టర్లకు లేఖ రాశారు. సకాలంలో జీతాలు చెల్లించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రకృతి వైపరీత్య నిర్వహణ చట్టం, ఐపీసీ కింద నేరంగా పరిగణించి సంబంధిత ఆసుపత్రులు, వైద్య సంస్థలు, అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts