ఆస్ట్రేలియాపై భారీగా సైబర్‌ దాడులు!

ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీ ఎత్తున సైబర్‌ దాడికి గురవుతోందని ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ వెల్లడించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై అత్యాధునిక పద్ధతుల్లో సైబర్‌ దాడికి పాల్పడుతున్నారని తెలిపారు.......

Published : 19 Jun 2020 11:46 IST

దీని వెనుక ఓ దేశ హస్తముందని ప్రధాని మోరిసన్‌ ఆరోపణ

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీ ఎత్తున సైబర్‌ దాడులకు గురవుతోందని ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ వెల్లడించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై అత్యాధునిక పద్ధతుల్లో సైబర్‌ దాడికి పాల్పడుతున్నారని తెలిపారు. ఓ దేశ మద్దతుతోనే ఇది జరుగుతోందని పేర్కొన్నారు. అయితే, అది ఏ దేశం అన్నది మాత్రం వెల్లడించలేదు. రాజకీయ, పారిశ్రామిక, ప్రభుత్వ, విద్య, వైద్య, అత్యవసర సేవలు, మౌలిక వసతులు ఇలా అన్ని రంగాలకు చెందిన సంస్థల్ని లక్ష్యంగా చేసుకున్నారన్నారు. 

చైనా-ఆస్ట్రేలియా మధ్య గత కొన్ని నెలలుగా సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్‌ ఏమైనా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటుందా అన్న ప్రశ్నకు స్పందించడానికి ఆయన నిరాకరించారు. నిఘా విభాగానికి చెందిన కొంత మంది అధికారులు మాత్రం రష్యా, ఉత్తర కొరియాలను ఉద్దేశించే మోరిసన్‌ ఆరోపణలు చేశారని వివరించడం గమనార్హం. దాడి జరుగుతున్న తీరు, వారు ఎంచుకుంటున్న మార్గాలు, లక్ష్యంగా చేసుకున్న సమాచారాన్ని బట్టి చూస్తే కచ్చితంగా దీని వెనుక ఓ దేశ ప్రభుత్వ అండ ఉన్నట్లు స్పష్టమవుతోందని మోరిసన్ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని