Published : 19 Jun 2020 23:06 IST

మలాలా చేతికి డిగ్రీ పట్టా

లండన్‌: బాలికల విద్యపై పోరాడుతూ పాకిస్థాన్‌లో తుపాకీ గుండుకు ఎదురొడ్డి నిలిచి అతి పిన్న వయసులోనే నోబెల్‌ శాంతి బహుమతి సాధించిన మలాలా యూసఫ్‌జయ్‌(22) విద్యాభ్యాసంలో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆమె డిగ్రీ పూర్తి చేసింది. తన కుటుంబంతో ఆ ఆనందకర క్షణాలను పంచుకున్న చిత్రాలను శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. తత్త్వశాస్త్రం, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం.. ప్రధాన అంశాలుగా ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొంది. ‘భవిష్యత్తు గురించి ఆలోచనలు లేవని.. నెట్‌ఫ్లిక్స్‌ చూడటం, చదువుకోవడం, నిద్రపోవడం.. ఇవే ప్రస్తుత దినచర్య’ అని వివరించింది. 

ఈశాన్య పాకిస్థాన్‌లోని స్వాత్‌ లోయలో తాలిబన్‌ ఉగ్రవాదులు 2012లో ఆమె తలపై కాల్చారు. ఆ ఘటనానంతరం అమెను బ్రిటన్‌ తరలించి మెరుగైన చికిత్స అందించారు. 2014లో నోబెల్‌ పురస్కారం దక్కే నాటికి ఆమె వయస్సు 17 సంవత్సరాలే.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని