IN PICS: ప్రముఖుల యోగాసనాలు చూశారా?

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పాటించేందుకు......

Updated : 21 Jun 2020 12:35 IST

దిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇంట్లోనే జరుపుకోవాల్సి వస్తోంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ ‘ఇంటి వద్దే యోగా - కుటుంబంతో యోగా’ ఇతివృత్తంతో జరుగుతున్న ఈ వేడుకల్లో  దేశంలోని పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి నివాసాల్లోనే యోగాసనాలు వేశారు. కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో యోగా ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయనీ.. ప్రజలందరినీ ఏకం చేయడంలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ యోగా డే సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. యోగా డే సందర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో యోగాస‌నాలు వేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి నివాసంలోని పచ్చిక బయళ్లలో యోగాసనాలు వేశారు. తన సతీమణితో కలిసి యోగా డేలో పాల్గొన్నారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతత కోసం ప్రతి భారతీయుడూ యోగా, ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు. జీవనశైలిలో వస్తున్న మార్పులతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆయన సందేశం ఇచ్చారు. 

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దిల్లీలోని తన నివాసంలో యోగసనాలు వేశారు.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి యోగా డేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగావారితో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. 

కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తన నివాసంలో యోగా డేలో పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దిల్లీలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. 

కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ యోగా డేని వినూత్నంగా నిర్వహించారు. వివిధ మతాలకు చెందిన ప్రతినిధులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు.

ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌ వద్ద నిర్వహించిన యోగా డేలో పాల్గొని ఆసనాలు వేశారు. 

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన నివాసంలో యోగా వేడుకల్లో పాల్గొన్నారు. 

ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ రాయ్‌పూర్‌లోని తన నివాసంలో యోగాసనాలు వేశారు.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. 

మధ్యప్రదేశ్‌లో భోపాల్‌ ఎంపీ, భాజపా నేత ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భోపాల్‌లోని పార్టీ కార్యాలయంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

నార్త్‌ సిక్కింలో ఐటీబీపీ జవాన్లు 18,800 అడుగుల ఎత్తులో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశంలో యోగసనాలు వేశారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇండో టిబెటిన్‌ సరిహద్దు దళం (ఐటీబీపీ) సిబ్బంది జంతు శిక్షణ పాఠశాలలో హిత్‌పురాలో గుర్రాలపై నిలబడి సాహసోపేతంగా యోగాసనాలు వేశారు. 

గుజరాత్‌లోని వడోదరలో యోగ నికేతన్‌ కేంద్రంలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15 దేశాల నుంచి ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొని 108 సూర్య నమస్కారాలతో కొవిడ్‌ యోధులకు తమ కృతజ్ఞత చాటారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని