పాక్‌ కాల్పుల్లో ఆర్మీ జవాను మృతి

పాకిస్థాన్‌ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్‌ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను ....

Updated : 22 Jun 2020 11:36 IST

కశ్మీర్‌ : పాకిస్థాన్‌ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్‌ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను అమరుడయ్యారు. కృష్ణఘాటి, నౌషెరా సెక్టార్‌లో పాక్‌ బలగాలు భారీగా కాల్పులకు పాల్పడ్డాయి. పాక్‌ కవ్వింపు చర్యలకు భద్రతాబలగాలు దీటుగా బదులిచ్చాయి. తెల్లవారుజామున భారత్‌,పాక్‌ బలగాల మధ్య 3 గంటలపాటు కాల్పులు చోటుచేసుకున్నాయి.

సరిహద్దుల వెంట తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ తూట్లు పొడుస్తోంది. ఈ నెలలో పాక్‌ బలగాల కాల్పుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

మరోవైపు అనంత్‌నాగ్‌ జిల్లా కాప్రాన్‌ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts