ఆ ప్రశ్నకు సమాధానమివ్వని డ్రాగన్‌!

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల్లో తమ దేశ సైనికులు ఎంతమంది చనిపోయారో .....

Published : 23 Jun 2020 01:11 IST

బీజింగ్‌: తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణల్లో భారత్‌ చేతిలో చైనా సైనికులు ఎంతమంది చనిపోయారో చెప్పేందుకు ఆ దేశం నిరాకరిస్తోంది. ఈ అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణినే కొనసాగిస్తోంది. భారత్‌ సైనికుల చేతిలో 40మంది చైనా సైనికులు హతమయ్యారంటూ ఇటీవల కేంద్రమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించగా తన వద్ద సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన బీజింగ్‌లో మీడియాతో మాట్లాడారు. సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఇరు దేశాల మధ్య దౌత్య, సైనికపరమైన చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. 

గల్వాన్‌ వద్ద చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో చైనా సైనికులు సైతం మృతి చెందినట్టు ఆ దేశానికి చెందిన అధికారిక మీడియా సైతం కథనాల్లో పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నోరుమెదపకపోవడం గమనార్హం. మరోవైపు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు సైనికాధికారుల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. 

సరిహద్దుల్లో దుస్సాహసానికి పాల్పడిన చైనా తీరుపై ఇటీవల కేంద్రమంత్రి వీకే సింగ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. గల్వాన్‌ ఘటనలో భారత్‌ 20మంది సైనికులను కోల్పోతే.. చైనాలో మాత్రం అంతకు రెట్టింపు సంఖ్యలో సైనికులు హతమయ్యారని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని