చైనా-భారత్ కావాలని.. ఈజిప్ట్-సూడాన్ వద్దని
భారత్.. చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. సరిహద్దు వివాదం విషయంలో భారత్.. చైనానే కాదు.. ప్రపంచంలో అనేక దేశాలు ఘర్షణ పడుతున్నాయి. కానీ ఈజిప్ట్.. సూడాన్ దేశాలు మాత్రం ఓ ప్రాంతాన్ని మాది కాదంటే మాది కాదని వదిలేస్తున్నాయి. మరి ప్రాంతం ఎక్కడ ఉంది? ఎందుకు వద్దంటున్నాయి?
బిర్ తావిల్.. ఈజిప్ట్-సూడాన్ దేశాల మధ్య ఎర్ర సముద్రం దగ్గర్లో 2వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ ప్రజలు నివసించడానికి అనువైన వాతావరణం ఉంది. కానీ, నిర్మానుష్యంగా ఉంటుంది. ఖాళీగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఇరు దేశాలు వద్దని వదులుకుంటున్నాయి. ఇందుకు కారణం బ్రిటిష్ ప్రభుత్వం చేసిన 1899 నాటి ఒప్పందమే. సూడాన్‌పై పాలన విషయంలో యూకే, ఈజిప్ట్‌ల మధ్య 1899 జనవరి 19న ‘సౌడన్’ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సూడాన్‌లోని ఎర్ర సముద్రం తీర ప్రాంతాన్ని ఈజిప్టునకు అప్పగించారు. అయితే ఆరు నెలల తర్వాత ఒప్పందాన్ని సవరించి పాలన బాధ్యతను సూడాన్‌కే ఇచ్చారు. ఆ తర్వాత 1902లో యూకే ప్రభుత్వం ఇరు దేశాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎర్రసముద్రం తీరంలోని హలయాబ్ ట్రయాంగిల్ ప్రాంతాన్ని సూడాన్‌లోని బ్రిటిష్ గవర్నర్ పాలనలో ఉంచి.. దానిని ఆనుకొని ఉన్న బిర్ తావిల్ ప్రాంతాన్ని ఈజిప్ట్‌కు ఇచ్చారు.
ఈ విభజనను ఈజిప్ట్ ఒప్పుకోలేదు. 1899 ఒప్పందం ప్రకారం ఎర్రసముద్ర తీర ప్రాంతంలోని హలయాబ్ ట్రయాంగిల్ తమకే చెందుతుందని, బిర్ తావిల్ సూడాన్‌దేనని తేల్చిచెప్పింది. అయితే సూడాన్ మాత్రం యూకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సరిహద్దు ప్రకారం.. హలయాబ్ తమదేనని, బిర్ తావిల్ ఈజిప్ట్‌నకు చెందిందని వాదించడం మొదలుపెట్టింది. దీంతో రెండు దేశాల నేతలు హలయాబ్‌ను తమదిగా ప్రకటించుకున్నారు. ఈ ప్రాంతం కోసం ఘర్షణపడ్డారు. బిర్ తావిల్ మాత్రం తమది కాదంటే కాదంటున్నారు. ఎందుకంటే హలయాబ్ తీర ప్రాంతం. దీని వల్ల వాణిజ్య పరంగా లాభం ఉంటుంది. అదే బిర్ తావిల్ కాస్త ఏడారి ప్రాంతం. దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే ఇరు దేశాలు బిర్ తావిల్‌ను వద్దంటున్నాయి. అలా ఏ దేశానికి చెందని ప్రాంతంగా బిర్ తావిల్ ఉండిపోయింది.
బిర్ తావిల్ తమదేనన్న సామాన్యులు
వర్జీనియాకు చెందిన జెరెమా హీటన్ అనే వ్యక్తి 2014లో బిర్ తావిల్ ప్రాంతాన్ని తనదేనని ప్రకటించుకున్నాడు. ఇందుకోసం ఈజిప్ట్‌నకు చెందిన మిలటరీ అధికారుల నుంచి పలు అనుమతులు తీసుకున్నట్లు వెల్లడించాడు. కానీ అంతర్జాతీయంగా ఆ ప్రాంతానికి ఎలాంటి గుర్తింపు రాలేదు. అలాగే 2017లో భారత్‌కు చెందిన సుయాశ్ దీక్షిత్ అనే వ్యక్తి కూడా ఈ ప్రాంతాన్ని తన రాజ్యంగా ప్రకటించుకొని ‘కింగ్‌డమ్ ఆఫ్ దీక్షిత్’గా నామకరణం చేశాడు. ఈ ప్రాంతానికి తానే ప్రధాన మంత్రి అని వెల్లడించాడు. అయితే అతడి ప్రతిపాదనను ఎవరూ గుర్తించలేదు. దీంతో ఇప్పటికీ ఆ ప్రాంతం ఎవరికీ చెందనిదిగానే ఉంది.
ఇలాంటివే మరికొన్ని..
* యూరప్‌లోని దునాబె నది తూర్పు తీరంలో ఉన్న కొన్ని ప్రాంతాలపై పట్టుకు సెర్బియా.. క్రోషియా దేశాల మధ్య శత్రుత్వం నడుస్తోంది. కానీ, పశ్చిమ తీరంలోని గొంజ సిగ ప్రాంతాన్ని మాత్రం ఇరు దేశాలు స్వీకరించట్లేదు.
* అంటార్కిటికాలో కొంత ప్రాంతాన్ని కొన్ని దేశాలు తమవిగా ప్రకటించుకున్నాయి. కానీ, మేరీ బైర్డ్ లాండ్‌ను మాత్రం ఏ దేశం తమదిగా ప్రకటించుకోలేదు. నిజానికి 1959 అంటార్కిటిక్ ఒప్పందం ప్రకారం ఒకప్పటి సోవియెట్ యూనియన్, యూఎస్ తప్ప ఏ దేశం ఇక్కడి ప్రాంతాలపై హక్కు సాధించలేదు.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
-
General News
Agnipath: విశాఖలో ఎల్లుండి నుంచి అగ్నిపథ్ ర్యాలీ.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ అధికారులు
-
India News
Euthanasia: కారుణ్య మరణం కోసం స్విట్జర్లాండ్‌కు..? అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన మిత్రురాలు
-
Technology News
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ డేటా ట్రాకింగ్.. నిజమెంత?
-
Movies News
Hello World Review: హలో వరల్డ్ రివ్యూ
-
India News
Noida Twin Towers: ట్విన్ టవర్ల కూల్చివేత మరోసారి పొడిగింపు.. కారణమిదే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- GST On Rentals: అద్దెపై 18% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ
- Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Rishabh Pant: రిషభ్ పంత్‌కు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి..
- Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య