రాష్ట్రాలకు 1340 మేడిన్‌ ఇండియా వెంటిలేటర్లు

దేశంలో కరోనా విజృంభణ దృష్ట్యా అత్యవసర ప్రాతిపదికన చేపట్టిన 50వేల వెంటిలేటర్ల తయారీలో భాగంగా.....

Published : 23 Jun 2020 20:33 IST

ఈ నెలాఖరుకు మరో 14వేల వెంటిలేటర్లు

దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ దృష్ట్యా అత్యవసర ప్రాతిపదికన చేపట్టిన 50వేల వెంటిలేటర్ల తయారీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 1340 వెంటిలేటర్లను రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా మహమ్మారి కలవర పెడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ట్రస్ట్‌ నిధుల నుంచి వీటిని అందించారు. కరోనా నియంత్రణ చర్యల్లో మే 14న ఈ ట్రస్ట్‌ రూ. 3,100 కోట్లు కేటాయించింది. రూ.2వేల కోట్లతో  50 వేల వెంటిలేటర్లు భారత్‌లోనే తయారు చేస్తుండగా.. వీటిలో 30వేల వెంటిలేటర్లను ప్రభుత్వ ఆధీనంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేస్తోంది. మిగతావి వివిధ ప్రైవేటు మెడికల్‌ సంస్థలు తయారు చేస్తున్నాయి. ఇప్పటికి 2,923 వెంటిలేటర్లు తయారు కాగా.. 1340 వెంటిలేటర్లు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపామని కేంద్రం వెల్లడించింది.

అలాగే, ఈ నెలాఖరు నాటికి అదనంగా మరో 14వేల వెంటిలేటర్లను అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ ట్రస్టు నిధుల నుంచే వలస కార్మికుల రక్షణకు రూ.1,000 కోట్లు విడుదల చేసినట్టు కేంద్రం తెలిపింది. వీటిలో 50శాతం నిధులు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయించగా.. కొవిడ్‌ కేసుల సంఖ్యను ఆధారంగా ఇంకో 40శాతం; మిగతా 10శాతం అందరికీ సమానంగా కేటాయింపులు చేసినట్టు వివరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని