బ‌డి పిల్ల‌ల నుంచి క‌రోనా వ్యాపించ‌డం లేదా?

పాఠ‌శాల విద్యార్థులు క‌రోనా వైర‌స్‌ను వ్యాప్తి చేస్తారా?  లేదా? అనే అంశంలో శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టికీ ఒక అంచ‌నాకు రాలేక‌పోతున్నారు. పెద్ద‌ల‌తో పోలిస్తే వారిలో తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని...

Published : 24 Jun 2020 14:40 IST

అవునంటున్న ఫ్రాన్స్ అధ్య‌య‌నం

ఇంట‌ర్నెట్ డెస్క్‌: పాఠ‌శాల విద్యార్థులు క‌రోనా వైర‌స్‌ను వ్యాప్తి చేస్తారా?  లేదా? అనే అంశంలో శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టికీ ఒక అంచ‌నాకు రాలేక‌పోతున్నారు. పెద్ద‌ల‌తో పోలిస్తే వారిలో తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని, సంక్ర‌మ‌ణ రేటు స్వ‌ల్ప‌మేన‌ని కొంద‌రు వాదిస్తున్నారు. మ‌రికొంద‌రేమో వారికీ ముప్పు ఉంద‌ని ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తున్నారు. ఫ్రాన్స్‌లో జ‌రిగిన తాజా అధ్య‌య‌నంలో ఏం తేలిందో చూద్దాం!

బ‌డికి వెళ్లే చిన్నారుల నుంచి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల‌కు నావెల్ క‌రోనా వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశాలు దాదాపుగా క‌నిపించ‌డం లేద‌ని పాశ్చ‌ర్ ఇన్‌స్టిట్యూట్ ప‌రిశోధ‌న పేర్కొంది. ప్యారిస్‌లోని క్రీపీ ఎల్ వ‌లోయిస్‌కు చెందిన 1340 మందిపై శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న చేప‌ట్టారు. ఇందులో ఆరు ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌కు చెందిన 510 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి నుంచి వైర‌స్ వ్యాప్తి చెంద‌డం లేద‌ని మూడు సంభావ్య‌త‌ల‌ను క‌నుగొన్నారు.

పెద్ద‌ల‌తో పోలిస్తే చిన్నారుల్లో ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్నాయ‌ని ఈ అధ్య‌య‌నంలో తేలింది. ఇత‌రుల‌కు వైర‌స్ వ్యాప్తి చెంద‌డం లేదు. కాబ‌ట్టి డెన్మార్క్ నుంచి స్విట్జ‌ర్లాండ్ వ‌ర‌కు పాఠ‌శాల‌ల‌ను తెర‌వ‌డంలో అర్థ‌ముంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. కొవిడ్‌-19 సోకిన 61 శాతం విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు సైతం వైర‌స్ ఉంటున్నట్లు వారు గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్న 7 శాతం మంది చిన్నారుల త‌ల్లిదండ్రుల్లో ఈ వైర‌స్ జాడ‌ లేద‌ని గ‌మ‌నించారు. అంటే పెద్ద‌ల నుంచే పిల్ల‌ల‌కు క‌రోనా సోకుతుంద‌ని నిర్ధ‌రించారు.

ఏదేమైన‌ప్ప‌టికీ వైర‌స్ సంక్ర‌మ‌ణ విధానం, మ‌హ‌మ్మారిని అర్థం చేసుకోని ఏ ప్రాంతాల‌ను తెర‌వాలి, మ‌ళ్లీ మూసేయాలి వంటి నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని శాస్త్ర‌వేత్త‌లు సూచించారు. ప్ర‌స్తుతం స్వ‌ల్ప అధ్య‌య‌నాలే చేస్తున్నార‌ని  పాఠ‌శాల‌ల చిన్నారుల‌పై విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు చేయాల్సి ఉంద‌ని  అంటు వ్యాధుల నిపుణుడు ఆర్నాల్డ్ ఫాంటానెట్ అన్నారు.  త‌మ అధ్య‌య‌నంలో 41 శాతం చిన్నారుల్లో ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌ని వెల్ల‌డించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని