గల్వాన్‌ వీరులకు ప్రశంస బ్యాడ్జీలు

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ ఘటన తర్వతా భారత సైన్యాధిపతి జనరల్ ఎం. ఎం. నరవణే ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.....

Published : 24 Jun 2020 22:42 IST

బహూకరించిన భారత సైన్యాధిపతి

లద్దాఖ్: తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ ఘటన తర్వతా భారత సైన్యాధిపతి జనరల్ ఎం. ఎం. నర్‌వణే ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే చైనా బలగాలతో వీరోచితంగా పోరాడి లేహ్‌లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ఆయన మంగళవారం పరామర్శించారు. తాజాగా ఆయన చైనాతో ఘర్షణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లను ప్రశంసించి వారికి ప్రశంసా బ్యాడ్జీలను బహూకరించారు. మరింత ఉత్సాహంతో పనిచేయాలని వారిని ప్రోత్సహించారని భారత సైన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలానే అక్కడి పరిస్థితులు, సైనిక సన్నద్ధతపై ఉన్నతస్థాయి సైనికాధికారులతో సమీక్ష జరిపారని పేర్కొంది.

ఈ నెల 15 తేదీన చైనాతో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసింది. ఈ ఘర్షణలో 70 మందికిపైగా జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో నెలకొన్న తీవ్రతలను తగ్గించేందుకు ఇరు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఘర్షణకు కేంద్ర బిందువైన ప్రాంతం నుంచి ఇరు దేశాల సైన్యం వెనక్కి వెళ్లేందుకు అంగీకారం జరిగినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని