ఉగ్రవాదుల దాడిలో జవాను, ఐదేళ్ల బాలుడి మృతి

జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు భారత జవానులపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ జవాను, ఐదేళ్ల బాలుడి ప్రాణాలను..

Published : 26 Jun 2020 16:51 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు భారత జవానులపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ జవాను, ఐదేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని బిజ్‌బెహరా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం 12:10 గంటలకు బిజ్‌బెహరా ప్రాంతంలోని పర్షాహి బాగ్ వంతెన సమీపంలో సీఆర్‌పీఎఫ్ 90 బెటాలియన్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఓ పోలీసు అధికారి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. సమావేశంపై జరిపిన కాల్పుల్లో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవానుతోపాటు, 5 సంవత్సరాల బాలుడు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పేర్కొన్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, ఉగ్రవాదుల ఏరివేతకు వేట ప్రారంభించామని ఆయన చెప్పారు. మరో ఘటనలో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు  ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని