ఏడాదిలోపు కరోనా వ్యాక్సిన్‌: WHO

కరోనా వైరస్‌కు ఏడాదిలోపు సూది మందు వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథానోమ్‌ అన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాకు అంతర్జాతీయ సహకారం అత్యంత ఆవశ్యకమని....

Published : 26 Jun 2020 17:23 IST

తప్పులు అందరూ చేస్తారని అంగీకరించిన అధానోమ్‌

బ్రసెల్స్‌: కరోనా వైరస్‌కు ఏడాదిలోపు సూది మందు వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గెబ్రెయేసస్‌ అన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాకు అంతర్జాతీయ సహకారం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. పర్యావరణం, ప్రజారోగ్యం, ఆహార భద్రతపై ఏర్పాటైన ఐరోపా పార్లమెంట్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో రావడం సవాలేనని అథానోమ్‌ అన్నారు. ఇందుకు రాజకీయ శక్తి అవసరం ఉందని చెప్పారు. వైరస్‌ బారిన పడే అవకాశం ఉన్నవారికి, బలహీనులకు మాత్రమే సూదిమందు ఇవ్వడం ఓ ఐచ్ఛికమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌభ్రాతృత్వ అవసరాన్ని మహమ్మారి గట్టిగా చెప్పిందన్నారు. ఆరోగ్యాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలన్నారు. దేశాలన్నీ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే అత్యవసర సన్నద్ధత ఉండాలని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ ఇప్పటికీ ప్రపంచమంతా తిరుగుతోందని అయితే ఐరోపా కూటమి ఎంతో మెరుగైందని అధానోమ్‌ అన్నారు. ఐరోపా పార్లమెంటు సభ్యుల్లో కొందరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాముఖ్యం గురించి మాట్లాడగా మహమ్మారి విషయంలో సంస్థ స్పందన సరిగ్గా లేదని మరికొందరు విమర్శించారు. దీనికి తప్పులు అందరూ చేస్తారని అథానోమ్‌ అంగీకరించారు. మహమ్మారి విషయంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకొనేందుకు, మదింపు చేసేందుకు ఒక స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే అది పని ప్రారంభిస్తుందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని