అంతర్జాతీయ విమానాల రద్దు కొనసాగింపు

అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దును పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. జులై 15 వరకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది. గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులు యథాతథంగా

Updated : 26 Jun 2020 17:53 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సాధారణ ప్రయాణికుల రైళ్ల సర్వీసులను ఆగస్టు 12 వరకు రద్దు చేసిన కేంద్రం.. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువునూ పొడిగించింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జులై 15 వరకు పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. అయితే ఈ షరతులు అంతర్జాతీయ కార్గో విమానాలకు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నడిపే విమానాలకు వర్తించవని స్పష్టంచేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను డీజీసీఏ మార్చి 23 నుంచి నిలిపేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను కేంద్రం కొనసాగిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని