పాక్‌ వీసాలున్న 200 మంది ఏమయ్యారు?

ఇంటెలీజెన్స్‌ వర్గాలు అప్రమత్తం అయ్యాయని సమాచారం. పాకిస్థాన్‌ వీసాలు పొందిన 200కు పైగా జమ్ము కశ్మీర్‌కు చెందిన యువత జాడ తెలియకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వారిని ఉగ్రవాద శిబిరాల్లోకి రిక్రూట్‌ చేసుకొని...

Published : 26 Jun 2020 20:12 IST

ముంబయి: ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయని సమాచారం. పాకిస్థాన్‌ వీసాలు పొందిన 200మందికి పైగా జమ్ము కశ్మీర్‌కు చెందిన యువత జాడ తెలియకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వారిని ఉగ్రవాద శిబిరాల్లోకి రిక్రూట్‌ చేసుకొని కశ్మీర్లో సమస్యలు సృష్టించేలా పాకిస్థాన్ శిక్షణ ఇచ్చే అవకాశం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

పాకిస్థాన్‌ హైకమిషన్‌ 2017, జనవరి నుంచి 399 మంది యువతకు పాకిస్థాన్‌ వీసాలు ఇచ్చింది. వారిలో జమ్ము కశ్మీర్‌కు చెందిన 218 మంది జాడ తెలియడం లేదు. ‘జమ్ము కశ్మీర్‌ యువతను పాకిస్థాన్‌ లక్ష్యంగా ఎంచుకుంది. 2019, ఫిబ్రవరిలో పుల్వామా దాడి తర్వాత యువతకు శిక్షణ ఇచ్చి రాష్ట్రంలో ఉగ్రదాడులు చేపట్టాలన్నది పాక్‌ పన్నాగం’ అని ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంటున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఉగ్రవాద శిక్షణ పొందిన వాళ్లను పాకిస్థాన్‌ ‘స్థానిక తిరుగుబాటు యోధులు’గా గుర్తిస్తోంది. కొన్ని నెలలుగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబడేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే జమ్ములో నక్కిన ఉగ్రవాదులను సైన్యం ఏరిపారేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని