మరో 6 నెలలూ ఉచిత రేషన్‌ ఇవ్వండి!

కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో మరో ఆరు నెలల పాటు  రాష్ట్రంలో ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయాలని......

Published : 27 Jun 2020 02:14 IST

కేంద్రాన్ని కోరిన ఝార్ఖండ్‌ సీఎం

రాంచీ: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రంలో ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయాలని ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌  కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకంలో  భాగంగా కేంద్రం మరో ఆరు మాసాల పాటు ఉచితంగా ఆహార, పప్పు ధాన్యాలను పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల్లోకి వలస కూలీల రాకతో పరిస్థితి మరింత సవాల్‌గా మారిందని లేఖలో పేర్కొన్నారు. అలాగే, లాక్‌డౌన్‌ కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతిష్ఠంభన ఇంకా పూర్తిగా తొలగిపోలేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఝార్ఖండ్‌లో నిన్న మరో 42 కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2261కి పెరిగింది. వీరిలో 1605మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 12మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని