35 అడుగుల తిమింగలం మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మందార్‌మని బీచ్‌లో 35 అడుగుల తిమింగలం మృతదేహం ఒకటి కొట్టుకొచ్చింది. ఈ బీచ్‌ కోల్‌కతాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం స్థానికులు వచ్చి చూసేసరికి అక్కడ

Published : 29 Jun 2020 23:58 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని మందార్‌మని బీచ్‌లో 35 అడుగుల తిమింగలం మృతదేహం ఒకటి కొట్టుకొచ్చింది. ఈ బీచ్‌ కోల్‌కతాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం స్థానికులు వచ్చి చూసేసరికి అక్కడ రక్తపు మడుగులో పడిఉన్న ఓ భారీ తిమింగలం కనిపించింది.  తిమింగలం మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నాయి. సమాచారం అందుకొన్న తూర్పు మిడ్నాపూర్‌ ప్రాంతానికి చెందిన అటవీశాఖ, వన్యప్రాణుల అధికారులు అక్కడకు చేరుకొని పరిశీలించగా తలపై గాయాలు కనిపించాయి. మందార్‌మని ప్రాంతం బాగా పేరున్న పర్యాటక ప్రదేశం. ఇక్కడికి డిఘా బీచ్‌ కూడా ఉంది. కరోనావైరస్‌ కారణంగా ఈ రెండు బీచ్‌లను అధికారులు మూసేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని